జిమ్ ట్రైనర్ రాహుల్ సింగ్ హత్యకు ఆమే కారణమా?
X
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో జిమ్ ట్రైనర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. రాజేంద్రనగర్ ఠాణా పోలీసులు, ప్రత్యక్షసాక్షుల వివరాల ప్రకారం.. దూల్‌పేట్‌కు చెందిన రాహుల్‌సింగ్ (27) కుటుంబం మణికొండ పరిధిలోని అలిజాపూర్‌లో ఉంటోంది. ఠాణా పరిధిలోని హైదర్‌గూడ సెలబ్రెటీ జిమ్‌లో రాహుల్ నిత్యం వ్యాయామం చేస్తుంటాడు. రోజూ మాదిరిగానే మంగళవారం సాయంత్రం జిమ్‌కు వచ్చిన రాహుల్ వ్యాయామం ముగించుకుని 6.30 గంటలకు తిరిగి వెళ్లడానికి సెల్లార్‌లో తన బైక్ వద్దకు వెళ్లాడు. అప్పటికే హత్య చేయడానికి పథకం రచించిన నలుగురు దుండగులు అతడి కళ్లలో పెప్పర్‌స్ప్రే కొట్టి కత్తులతో విచక్షణారహితంగా దాడిచేసి.. రెండు బైక్‌లపై పరారైనట్లు సమాచారం. రాహుల్‌సింగ్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు.
మృతుడు రాహుల్ సింగ్ గతంలో ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని, అయితే విభేదాలు రావడంతో దూరంగా ఉంటున్నాడని పోలీసులు తెలిపారు.ఇదే సమయంలో రాహుల్ సింగ్ కు మరో యువతితో ఎంగేజ్ మెంట్ అయింది. దీంతో రాహుల్ వద్ద నుంచి డబ్బులు లాగేందుకు ప్రియురాలు, ఆమె తల్లి ప్లాన్ చేశారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే అజార్ అనే వ్యక్తితో కలిసి ప్రియురాలు రాహుల్ సింగ్ ను బెదిరింపులకు గురి చేసింది. ఈ క్రమంలోనే మ్యాటర్ సెటిల్ చేస్తానన్న అజార్ రాహుల్ వద్ద రూ.4 లక్షలు నొక్కేశాడని వెల్లడించారు.ఈనెల 24న అజార్, రాహుల్ సింగ్ మధ్య గొడవ జరిగిందన్న పోలీసులు తన డబ్బులు ఇవ్వాలని అజార్ ని రాహుల్ డిమాండ్ చేశారు.ఈ గొడవ జరిగిన ఆరు రోజులకే రాహుల్ హత్య జరిగిందని వెల్లడించారు.