Home > తెలంగాణ > Telangana: రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్.. ఏబీపీ - సీ ఓటర్ సర్వేలో వెల్లడి..

Telangana: రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్.. ఏబీపీ - సీ ఓటర్ సర్వేలో వెల్లడి..

Telangana: రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్.. ఏబీపీ - సీ ఓటర్ సర్వేలో వెల్లడి..
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30న రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో వివిధ సంస్థలు పార్టీల విజయావకాశాలపై సర్వేలు నిర్వహించాయి. తాజాగా ఏబీపీ - సీ ఓటర్ నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో తెలంగాణలో హంగ్ ఏర్పడే అవకాశముందని తేలింది. బీఆర్ఎస్కు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ తప్పదని చెప్పింది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు తగ్గగా కాంగ్రెస్కు 10శాతానికిపైగా పెరిగినట్లు సర్వే రిపోర్టు చెబుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొందని ఏబీపీ - సీ ఓటర్ సర్వే చెబుతోంది. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ 43 నుంచి 55 స్థానాలకు పరిమితం కానుండగా.. కాంగ్రెస్ 48 నుంచి 60స్థానాలను ఖాతాలో వేసుకుంటుందని సర్వే స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించినా బీజేపీకి వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని సర్వే స్పష్టం చేసింది. ఆ పార్టీ 5 నుంచి 11 సీట్లు మాత్రమే గెలుచుకోవచ్చని చెప్పింది.

ఓట్ షేరింగ్ విషయంలోనూ కాంగ్రెస్ దూసుకెళ్తుందని ఏబీపీ సర్వేలో తేలింది. గత ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ ఈసారి 10శాతం ఓట్ షేర్ పెంచుకుని 38.8శాతం ఓట్లు కొల్లగొడుతుందని చెప్పింది. అధికార బీఆర్ఎస్ ఓట్ షేర్ 9.4శాతం తగ్గి 37 శాతానికి పరిమితమవుతుందని స్పష్టంచేసింది. బీజేపీకి 9.3శాతం పెరుగుదలతో 16శాతం ఓట్లు పడతాయని సర్వేలో వెల్లడైంది.

Updated : 9 Oct 2023 7:30 PM IST
Tags:    
Next Story
Share it
Top