Home > తెలంగాణ > ఏబీవీపీ కార్యకర్త జుట్టు పట్టుకుని లాగిన కానిస్టేబుల్..వీడియో వైరల్

ఏబీవీపీ కార్యకర్త జుట్టు పట్టుకుని లాగిన కానిస్టేబుల్..వీడియో వైరల్

ఏబీవీపీ కార్యకర్త జుట్టు పట్టుకుని లాగిన కానిస్టేబుల్..వీడియో వైరల్
X

హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. ఏబీవీపీ మహిళా కార్యకర్తపై పోలీసులు ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసింది. వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూముల జీవో నెం.55 వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వారికి ఏబీవీపీ నేతలు మద్దతిస్తూ నిరసన చేపట్టారు.ఇందులో పాల్గొన్న ఓ కార్యకర్తను బైక్ వెంబడించిన కానిస్టేబుల్ జుట్టు పట్టుకుని లాగారు.దీంతో ఆమె కిందపడిపోయింది.ఈ ఘనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. నిరసనకారులను చెదరగొట్టే క్రమంలో.. పోలీసులు కాస్త దురుసుగా ప్రవర్తించారు. విద్యార్థులకు మద్దతు తెలుపుతూ.. ఈరోజు ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుండగా.. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే..ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ ఝాన్సీ.. పోలీసులను తప్పించుకుని పరుగెత్తారు. ఆమెను పట్టుకునేందుకు.. ఇద్దరు మహిళా పోలీసులు.. స్కూటీపై ఆమెను వెంబడించారు. దగ్గరికి చేరుకోగానే.. వెనుక ఉన్న పోలీసు ఝాన్సిని ఆపే ప్రయత్నంలో జుట్టును పట్టుకున్నారు. అయితే.. స్కూటీ రన్నింగ్‌లో ఉండటంతో.. ఝాన్సి కింద పడిపోయారు. అయినప్పటికీ.. ఆ పోలీసు జుట్టు వదలకుండా అలాగే పట్టుకున్నారు. అయితే.. ముందున్న పోలీసు బండిని వెంటనే ఆపేసింది. అయితే.. ఈ ఘటనలో విద్యార్థి నాయకురాలికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే.. బండిని వెంటనే ఆపేయటంతో.. పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ వీడియో అవుతుంది.ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇదేనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దాడి పై స్పందించిన సీపీ విచారణ జరిపి మహిళ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు

Updated : 25 Jan 2024 10:55 AM IST
Tags:    
Next Story
Share it
Top