ACB NOTICE: బంజారాహిల్స్ సీఐ, ఎస్సైలకు ఏసీబీ నోటీసులు
X
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. సీఐ నరేందర్, ఎస్సై నవీన్ రెడ్డి, హోంగార్డు హరిలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తెలిపారు. ఇవాళ ఉదయం వారిని ఏసీబీ కార్యాలయానికి తరలించిన అధికారులు నోటీసులు ఇచ్చి పంపించారు. సుమారు 20గంటల పాటు వారిని విచారించారు.
స్కై లాంజ్ పబ్ ఎండీని సీఐ నరేందర్ బెదిరించి, డబ్బులు డిమాండ్ చేయడంతో ఆ పబ్ ఓనర్ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. స్కైలాంజ్ పబ్ ఓనర్తో మొదట రూ. 4.5 లక్షల బేరం కుదుర్చుకున్న సీఐ నరేందర్.. ఆ తర్వాత కొంత తగ్గి రూ.3 లక్షలకు డీల్ సెట్ చేసుకున్నారు. ఇందులోని రూ.50 వేలు పబ్ ఓనర్ జూన్లోనే గతంలోనే సీఐ నరేందర్కు చెల్లించాడు. ఆ సమయంలో పబ్ ఓనర్ వీడియో రికార్డ్ చేశాడు.
ప్రస్తుతం ఈ ముగ్గురితో పాటు మరికొంతమంది ఎస్ఐలను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఏసీబీ పక్కా ఆధారాలతో సోదాలు నిర్వహించింది. కాగా ఈ కేసులో సీఐ నరేందర్ ఏ1గా చేర్చింది. ఏ2గా ఎస్సై నవీన్ రెడ్డి, ఏ3గా హోంగార్డ్ హరి పేర్లను చేర్చి కేసు నమోదు చేసింది. సీఐ నరేందర్ చాంబర్తో పాటు ఆయన ఇంట్లో కూడా ఏసీబీ తనఖీలు చేపట్టింది. ఈ క్రమంలో సీఐ నరేందర్ ఛాతీ నొప్పికి గురయ్యారు. దీంతో ఆయనను ఏసీబీ అధికారులు అపోలో హాస్పిటల్ కు తరలించారు.