Home > తెలంగాణ > HMDA మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

HMDA మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

HMDA మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
X

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. శివ బాలకృష్ణ బంధువులు సహా ఆయనకు ఆస్తులు ఉన్న పలు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పదవిని అడ్డుపెట్టుకుని శివ బాలకృష్ణ కోట్లలో సంపాదించినట్లు ఏసీబీ గుర్తించారని సమాచారం. శివ బాలకృష్ణ ప్రస్తుతం హైదరాబాద్‌ మెట్రోలో పనిచేస్తున్నారు.


Updated : 24 Jan 2024 2:12 PM IST
Tags:    
Next Story
Share it
Top