తెల్లవారుజామున ఘోరం.. లారీ డ్రైవర్ సజీవ దహనం
X
ప్రమాదవశాత్తు డీసీఎం లారీ దగ్ధమైన ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని గురువాయిగూడెం సమీపంలో నేషనల్ హైవేపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అనకాపల్లి జిల్లా నుండి హైదరాబాద్‌కు కెమికల్‌లోడ్‌తో వెళ్తున్న డీసీఎం లారీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. గురువాయిగూడెం రాగానే ఒక్కసారిగా ఎగిసిపడి .. లారీ పూర్తిగా కాలిబూడిదైపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. డ్రైవర్‌కు తోడుగా ఉన్న లారీ ఓనర్ కి తీవ్ర గాయాలు అయ్యాయి.
గమనించిన ఇతర వాహనదారులు ఆయన్ను బయటకు లాగి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాహనాదారులు వెంటనే పోలీసులకు, హైవే పెట్రో సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా సహాయక చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ ఘటనలో లారీ చూస్తుండగానే పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.