మియాపూర్ కాల్పుల ఘటన.. నిందితుడి అరెస్ట్..
X
మదీనాగూడ కాల్పుల ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. హోటల్ మేనేజర్ దేవేందర్ పై కాల్పులు జరిపిన నిందితున్ని పట్టుకున్నారు. కేసును సవాలుగా తీసుకున్న మాదాపూర్ డీసీపీ నిందితున్ని పట్టుకునేందుకు నాలుగు బృందాలు ఏర్పాటు చేశారు. దీంతో గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు.
దేవేందర్పై కాల్పులకు తెగబడ్డ నిందితుడు గతంలో సందర్శిని ఎలైట్ హోటల్లో పనిచేసిన రిత్విక్గా గుర్తించారు. నెల రోజుల క్రితం ఓ అమ్మాయి విషయంలో గొడవ జరగడంతో దేవేందర్.. రిత్విక్పై చేయి చేసుకోవడంతో పాటు హోటల్ మేనేజ్మెంట్కు కంప్లైట్ చేశారు. దీంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ ఘటనతో దేవేందర్పై రిత్విక్ కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది.
దేవేందర్ ను హత్య చేయాలని నిర్ణయించుకున్న రితేష్ అందుకోసం ఓ నాటు తుపాకీని సమకూర్చుకున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి విధులు ముగించుకుని బయటకు వచ్చిన దేవేందర్తో రిత్విక్ ఘర్షణకు దిగాడు. వెంట తెచ్చుకున్న నాటు తుపాకీతో దేవేందర్ పై 6రౌండ్ల కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలారు.