Home > తెలంగాణ > ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూత

ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూత

ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూత
X

ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. తన పాటతో ఉద్యమాలకు ప్రాణం పోసి, యువతలో ఉద్యమ స్పూర్తిని నింపిన గద్దర్ తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న గద్దర్.. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6) మరణించారు. తన పాటతో తెలంగాణ ఉద్యమంలో ఊపుతెచ్చి కీలక పాత్ర పోషించారు.

గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. 1949లో సిద్ధిపేట జిల్లా తూప్రాన్ లో ఆయన జన్మించారు. ఆయన విద్యాభ్యాసమంతా.. నిజామాబాద్, హైదరాబాద్ లోనే జరిగింది. ఉద్యమ కారుడిగా మారక ముందు 1975లో గద్దర్ కెనరా బ్యాంకులో ఉద్యోగం కూడా చేశారు. 1987 నుంచి ఆయనలో ఉద్యమ భవాలు మొదలయ్యాయి. అప్పుడే కారంచేడు దళితుల హత్యలపై పోరాడారు. నకిలీ ఎన్ కౌంటర్ లను తీవ్రంగా వ్యతిరేకించారు. 1997 ఏప్రిల్ 6న గద్దర్ పై హత్యాయత్నం కూడా జరిగింది. గాయకుడిగా గద్దర్ ప్రస్థానానికి.. నీ పాదం మీద పుట్టు మచ్చనై పాటకు నంది అవార్డు కూడా వచ్చింది. కానీ దాన్ని గద్దర్ తిరస్కరించారు.


















Updated : 6 Aug 2023 3:46 PM IST
Tags:    
Next Story
Share it
Top