Home > తెలంగాణ > Revanth Reddy : తెలంగాణలో ఆదానీ గ్రూప్‌ భారీగా పెట్టుబడులు.. దావోస్‌ వేదికగా ఒప్పందం!

Revanth Reddy : తెలంగాణలో ఆదానీ గ్రూప్‌ భారీగా పెట్టుబడులు.. దావోస్‌ వేదికగా ఒప్పందం!

Revanth Reddy  : తెలంగాణలో ఆదానీ గ్రూప్‌ భారీగా పెట్టుబడులు.. దావోస్‌ వేదికగా ఒప్పందం!
X

తెలంగాణలో భారీగా పెట్టుడబులు పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో మెుత్తం రూ. 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయినట్లు తెలిసింది. బహుళ ప్రయోజనాలతో అదానీ గ్రూప్ ఈ పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ఇరువురూ చర్చించి నాలుగు ఎంవోయూలు కుదుర్చుకున్నారు.





ప్రభుత్వ అధికారిక ప్రకటన ప్రకారం, అదానీ గ్రీన్ ఎనర్జీ 1350 మెగావాట్ల రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయడానికి రూ. 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. చందనవెల్లిలో డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు అదానీకాన్ఎక్స్ డేటా సెంటర్ రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ తెలంగాణలో ఏడాదికి 6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో (MTPA) సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌లో రూ.1,400 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అలాగే తెలంగాణలోని హైదరాబాద్‌లోని అదానీ ఏరోస్పేస్, డిఫెన్స్ పార్క్‌లోని కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి, తయారీ కేంద్రాలలో అదానీ గ్రూప్ ఏరోస్పేస్, డిఫెన్స్ రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు అవసరమైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, సహాయాన్ని అందజేస్తుందని గౌతమ్ అదానీకి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.





ఇక దావోస్‌లో సీఎం రేవంత్ మూడోరోజు పర్యటన కొనసాగుతోంది. ఇవాళ పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అయ్యారు. అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతం అదానీ, టాటాసన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌తో ఆయన సమావేశమయ్యారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌, గ్లోబల్‌ హెల్త్‌ స్ట్రాటజీ వైస్‌ ప్రెసిడెంట్‌ విలియం వార్‌, వీఆర్‌ఎల్‌డీసీ ప్రతినిధులను కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం వారికి వివరించారు. రేవంత్‌ వెంట ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర అధికారులు ఉన్నారు.







Updated : 17 Jan 2024 8:34 AM GMT
Tags:    
Next Story
Share it
Top