టికెట్ రాని నేతలమంతా ఆ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తాం : అద్దంకి
X
గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచి.. బీఆర్ఎస్లో చేరిన 12మంది ఎమ్మెల్యేలపై అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ 12 మందిని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. తనతో సహా ఈ ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోని నేతలమంతా కలిసి... పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ను వీడే నేతలంతా ఓడిపోయే పార్టీలోకి వెళ్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం చచ్చిపోతుందన్నారు.
తనకు టికెట్ రాకపోవడంపైనా అద్దంకి స్పందించారు. తనకు టికెట్ రాకున్నా.. పార్టీ గెలుపు కోసం పని చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ - బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్ మీటింగ్లకు లేని రూల్స్ కాంగ్రెస్కే ఎందుకని ప్రశ్నించారు. కాగా ఈ సారి తుంగతుర్తి టికెట్ ఆశించిన అద్దంకికి నిరాశే ఎదురైంది. అధిష్టానం ఆ టికెట్ ను మందు శామ్యూల్ కు ఇచ్చింది. అయినా దయాకర్ అసంతృప్తి చెందకుండా పార్టీ గెలుపుకు కృషి చేస్తానని ప్రకటించారు