Home > తెలంగాణ > Soyam Bapu Rao : ఎంపీ సోయం బాపురావు షాకింగ్ కామెంట్స్

Soyam Bapu Rao : ఎంపీ సోయం బాపురావు షాకింగ్ కామెంట్స్

Soyam Bapu Rao : ఎంపీ సోయం బాపురావు షాకింగ్ కామెంట్స్
X

బీజేపీ ప్రకటించిన తొలి విడతలో లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆ పార్టీ ఎంపీ సోయం బాపురావు షాకింగ్ కామెంట్స్ చేశారు. నాకు టికెట్ రాకుండా కొంత మంది అగ్ర నేతలు అడ్డుపడ్డారని ఆయన అన్నారు. నేను ఎక్కడ గెలుస్తానో అనే భయం వాళ్లకు ఉందన్నారు. కొమ్మపై ఆధారపడే పక్షిని కాదు నేను.. రెక్కల మీద ఆధారపడిన పక్షిని.. నేను స్వతహాగా ఎగురగలను. టికెట్‌ రాకపోతే నా దారి నేను చూసుకుంటాను. ఆదిలాబాద్ పార్లమెంట్ సీటు నాదే.. గెలిచేది కూడా నేనే. పార్టీ ఏదనేది అధిష్ఠానం ఆలోచించుకోవాలని సోయం అన్నారు. 2019లో ‌టికెట్ ఇస్తా అంటే పారిపోయిన నేతలే టికెట్ కోసం ఇప్పుడు పోటీపడుతున్నారు. ఏ బలంలేని సమయంలో నా సొంత బలంతో బీజేపీకి విజయం అందించాను.

జడ్పీటీసీలను, ఎంపీపీలను, చివరికి నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించాను. నా బలం, బలగం కావాలనుకుంటే పార్టీ టికెట్‌ ఇస్తుంది. రెండో లిస్ట్‌లో నాకు టికెట్‌ వస్తుందని భావిస్తున్నాను. ఎవరి మీద ఆధారపడే నేతను నేను కాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 195 మందితో కూడిన పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను శనివారం సాయంత్రం బీజేపీ పార్టీ అధిష్టానం విడుదల చేసింది. అందులో తెలంగాణ నుంచి తొమ్మిది మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ముగ్గురు సిట్టింగులతో పాటు మరో ఆరుగురికి అవకాశం ఇచ్చింది. అనూహ్యంగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుకు మొండిచేయి చూపించింది. దీంతో ఇవాళ మీడియా సమక్షంలో ఆవేదన వ్యక్తం చేశారు.




Updated : 3 March 2024 12:56 PM IST
Tags:    
Next Story
Share it
Top