Home > తెలంగాణ > నాలుగు గంటల నరకం.. నడి రోడ్డుపై మహిళ ప్రసవం..

నాలుగు గంటల నరకం.. నడి రోడ్డుపై మహిళ ప్రసవం..

నాలుగు గంటల నరకం.. నడి రోడ్డుపై మహిళ ప్రసవం..
X

ఆస్పత్రికి వెళ్లేందుకు సరైన దారి లేక సమయానికి అంబులెన్స్‌ రాక ఓ ఆదివాసీ మహిళ నరకం అనుభవించింది. పురుటి నొప్పులతో నాలుగు గంటలపాటు అల్లాడి పోయింది. చివరకు నడిరోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది. ఎట్టకేలకూ అంబులెన్స్ రావడంతో తల్లి బిడ్డను హాస్పిటల్ కు తరలించారు.





నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని తులసిపేటకు చెందిన గంగామణి నిండు గర్భిణి. గురువారం రాత్రి పురుటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 15 కిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్ కోసం కాల్ చేయగా.. రోడ్డు సరిగా లేనందున అక్కడకు రాలేమని చెప్పారు. గ్రామ సమీపంలోని పస్పుల వంతెన మీదుగా తీసుకువస్తే ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. గంగామణి కుటుంబ సభ్యులు అతికష్టమ్మీద ఎడ్ల బండిలో కడెంవాగు దాటించారు. అయితే ఒడ్డుకు చేరినా అంబులెన్స్ రాకపోవడంతో ఫోన్ చేయగా.. డీజిల్ అయిపోయిందని చెప్పారు.





రాత్రి 9గంటల సమయంలో గంగామణికి నొప్పులు తీవ్రం కావడంతో కుటుంబసభ్యులు నడిరోడ్డుపైనే ప్రసవం చేశారు. నాలుగు గంటల నరకయాతన అనంతరం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. కాసేపటికి అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది ప్రథమ చికిత్స చేసి పెంబి ప్రాథమిక హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని డాక్టర్లు చెప్పారు.




Updated : 25 Aug 2023 10:48 AM IST
Tags:    
Next Story
Share it
Top