Home > తెలంగాణ > అబద్దాలు చెప్పి రేవంత్ గద్దెనెక్కారు..కేటీఆర్ ఫైర్

అబద్దాలు చెప్పి రేవంత్ గద్దెనెక్కారు..కేటీఆర్ ఫైర్

అబద్దాలు చెప్పి రేవంత్ గద్దెనెక్కారు..కేటీఆర్ ఫైర్
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఈ మధ్య రేవంత్‌కు ఫ్రస్టేషన్ ఎక్కువైందన్నారు. రేవంత్ పక్కనే మానవబాంబులు ఉన్నాయని, అవే రేవంత్‌ను ఖతం చేస్తాయన్నారు. రేవంత్ కచ్చితంగా 5 ఏళ్లు సీఎంగా ఉండాలని, కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు చేయకపోతే రోడ్డుకీడుస్తామన్నారు. రేవంత్ మగాడివైతే ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని సవాల్ విసిరారు. దమ్ముంటే 100 రోజుల్లో రూ.2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. ప్రజలకు అబద్దాలు చెప్పి రేవంత్ గద్దెనెక్కారన్నారు.

కాంగ్రెస్ తెలంగాణకు కరువు తెచ్చిందని, అది రాకుండా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారన్నారు. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొట్టిందని, కేసీఆర్‌పై ఉన్న కోపాన్ని రేవంత్ సర్కార్ రైతులపై తీర్చుకుంటోందన్నారు. మొన్న మోడీ తెలంగాణకు వచ్చి రెండు చోట్ల శంకుస్థాపనలు చేసి వెళ్లిపోయారని, ఆ సమయంలో రేవంత్ ఆవేశంతో ఊగిపోతూ నోటికొచ్చిన మాటలు మాట్లాడారన్నారు. అధికారంలో ఉండి రేవంత్ తీవ్రమైన ఫ్రస్టేషన్‌కు గురవుతున్నారని మండిపడ్డారు.

గొంతు కోస్తా, కడుపు చింపుతా, పేగులు మెడలో వేసుకుని తిరుగుతా అంటూ రేవంత్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ జేబులో కత్తెర పెట్టుకుని తిరగడం ఏంటో అర్థం కావడం లేదని, అలాంటోడు సీఎం కావడం మన కర్మ అని విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఎవరు గాడిదో, ఎవరు గుర్రమో రేవంత్ పాలన చూసిన తర్వాతే తెలుస్తుందన్నారు. బీపీ పెంచుకుని ఆగమాగం కాకుండా బీపీ గోలి వేసుకుని హాయిగా కూర్చో అని సీఎం రేవంత్‌కు కేటీఆర్ సూచించారు.



Updated : 7 March 2024 4:28 PM IST
Tags:    
author-thhumb

Krishna

సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.


Next Story
Share it
Top