Akbaruddin Owaisi : ప్రొటెం స్పీకర్గా ప్రమాణస్వీకారం చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ
X
ఎంఐఎం పార్టీకి చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజభవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రొటెం స్పీకర్ గా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఒవైసీతో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హరీశ్ రావు తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. సాధారణంగా సీనియర్ సభ్యులకు ప్రొటెం స్పీకర్ బాధ్యతలు అప్పగిస్తుంటారు. ఇందులో భాగంగా ఆ బాధ్యతలు నిర్వహించాలని అక్బరుద్దీన్‌ను కోరగా అందుకాయన అంగీకరించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు అక్బరుద్దీన్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.