Home > తెలంగాణ > విపక్షాల మీటింగ్‌కి దూరంగా ఉన్న కేసీఆర్‌తో అఖిలేష్ భేటీ!!!

విపక్షాల మీటింగ్‌కి దూరంగా ఉన్న కేసీఆర్‌తో అఖిలేష్ భేటీ!!!

విపక్షాల మీటింగ్‌కి దూరంగా ఉన్న కేసీఆర్‌తో అఖిలేష్ భేటీ!!!
X

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. పలు పార్టీలతో మంతనాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా పార్టీల అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ తో భేటీ అయ్యారు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జరిగిన ఈ భేటీలో ప్రస్తుతం నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై చ‌ర్చించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకున్న అఖిలేష్ యాద‌వ్‌కు సీఎం కేసీఆర్ సాద‌రంగా స్వాగ‌తం ప‌లికారు. బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్ర‌త్యేక విమానంలో చేరుకున్న అఖిలేష్ యాద‌వ్‌కు మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, ప్ర‌శాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అటు నుంచి నేరుగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకున్నారు.




అయితే అంతకు ముందు విపక్షాలంతా కలసి.. జూలై 23 న శుక్రవారం బీహార్ రాజధాని పాట్నాలో సమావేశమయ్యారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (TMC), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), శివసేన (UBT), ద్రవిడ మున్నేత్ర వంటి వివిధ రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో కూడిన ఈ సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వం వహించారు. కజగం (DMK), జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM), సమాజ్‌వాదీ పార్టీ (SP), నేషనల్ కాన్ఫరెన్స్ (NC), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP), CPI, CPM, CPI ML, జనతాదళ్ యునైటెడ్ (JDU), మరియు రాష్ట్రీయ జనతాదళ్ ( RJD) కూడా హాజరయ్యాయి.

అయితే ఈ సమావేశానికి బీఆర్ఎస్ దూరంగా ఉంది. అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరంలో ఉండాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అందుకే కాంగ్రెస్ భాగమైన ఈ సమావేశానికి బీఆర్ఎస్ దూరమైంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ-టీమ్ అని ఏన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన కామెంట్స్‌పై ఇందుకు మరో కారణం. ఈ క్రమంలోనే సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.




Updated : 3 July 2023 9:01 AM GMT
Tags:    
Next Story
Share it
Top