Home > తెలంగాణ > ఆ డబ్బుతో 3 వేల ఇంటర్నేషనల్ స్కూళ్లు వచ్చేవి.. ఆకునూరి మురళి

ఆ డబ్బుతో 3 వేల ఇంటర్నేషనల్ స్కూళ్లు వచ్చేవి.. ఆకునూరి మురళి

ఆ డబ్బుతో 3 వేల ఇంటర్నేషనల్ స్కూళ్లు వచ్చేవి.. ఆకునూరి మురళి
X

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో లక్ష కోట్ల ప్రజల సొమ్ము వృధా అయిందని, ఆ డబ్బుతో 3 వేల ప్రభుత్వ ఇంటర్నేషనల్ స్కూళ్లు వచ్చేవని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. అలాగే నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులు కట్టించవచ్చని అన్నారు. అలాగే ప్రతి మండలానికి 5 బస్సులు కేటాయించి ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించవచ్చని అన్నారు.

ఇక ముమ్మాటికీ కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్పుడు డిజైన్ అని ఆయన అన్నారు. తప్పుడు డిజైన్ కు బాధ్యులు అయిన నాటి సీఎం కేసీఆర్ తో సహా అధికారులు, ఇంజినీర్లు, మంత్రులను ప్రాసిక్యూట్ చేసి యావజ్జీవ శిక్ష పడేటట్లు చేయాలని అన్నారు. వాళ్లను జైలుకు పంపాలని అన్నారు. భవిష్యత్తులో ఇంజినీర్లకు అహంకార పూరిత, అవినీతి రాజకీయ నాయకులకు ఇది ఒక గుణపాఠం కావాలని అన్నారు.


Updated : 21 Dec 2023 6:15 PM IST
Tags:    
Next Story
Share it
Top