ఎన్నికల వేళ అన్ని శాఖలూ సమన్వయంతో పని చేయాలి..సీఎస్ శాంతికుమారి
X
తెలంగాణలో ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు సీఎస్ శాంతికుమారి. ఎలక్షన్ రూల్స్ పై సచివాలయంలో ఆమె ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణ, ప్రవర్తనా నియమావళి అమలుపై అన్ని ప్రధాన శాఖల్లో ప్రత్యేక కంట్రోల్‌రూంలను ఏర్పాటు చేయాలన్నారు.
తెలంగాణ సరిహద్దుల వద్ద ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిఘా పెంచాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే వివిధ శాఖలు చెక్ పోస్టులను ఏర్పాటు చేశాయని చెప్పారు. వాటిలో 9 అంతరాష్ట్ర, 444 పోలీసుశాఖ చెక్ పోస్టులు ఉన్నాయని తెలిపారు. ఆబ్కారీ శాఖ ఏర్పాటు చేసిన 21 అంతర్రాష్ట్ర, 6 మొబైల్ చెక్‌పోస్టుల ద్వారా అక్రమ మద్యం తయారీకి అవకాశం ఉన్న 8 జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి నుంచి కూడా మద్యం రవాణాను పర్యవేక్షించాలని సీఎస్ శాంతికుమారి అన్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.