Home > తెలంగాణ > ములుగు జిల్లాలో ఆల్ టైమ్ రికార్డ్ వర్షం

ములుగు జిల్లాలో ఆల్ టైమ్ రికార్డ్ వర్షం

ములుగు జిల్లాలో ఆల్ టైమ్ రికార్డ్ వర్షం
X

తెలంగాణ జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు జిల్లాలో అయితే తెలంగాణ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్ వర్షం పడింది. అక్కడి లక్ష్మీదేవి పేటలో 650 మి.మీ వర్షం కురిసింది.

వరంగల్, ములుగు, కరీంనగర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. అక్కడ వాగులు, వంకలూ పొంగిపొర్లుతున్నాయి. లాస్ట్ 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమొదయింది. ములుగు జిల్లాలో లక్ష్మీదేవి పేట వానలకు మునిగిపోయింది. 650 మి.మీ వర్షపాతంతో గ్రామం అంతా నిండిపోయింది. మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో కూడా 616.5 శాతం వర్షపాతం నమోదయ్యింది. రేగొండలో 460 మి.మీ, చెల్పూరులో 457 మి.మీ వర్షం కురిసింది. ఏడిదిలో కురవాల్సిన వర్షాలు మొత్తం ఒక్కరోజులోనే కురిసాయని అధికారులు చెబుతున్నారు.

గతంలో తెలంగాణలో ఆల్ టైం అత్యధిక వర్షపాతం 675మి.మీ వర్షం నమోదయ్యింది. 1996 లో జూన్ 17. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొయిదా లో ఇంత వర్షం పడింది. ప్రస్తుతం ఈ ఊరు ఇప్పుడు ఏపీలో లో విలీనమైంది. అలాగే ములుగు జిల్లా వాజేడులో 2013 జులై 19న

24 గంటలలో 517.5 మిమి వర్షంపాతం నమోదైంది. ఇప్పుడు దానిని మించిన రికార్డు వర్షం పడిందని అధికారులు చెబుతున్నారు.

Updated : 27 July 2023 2:36 PM IST
Tags:    
Next Story
Share it
Top