అల్లు అర్జున్ మామకు నో టికెట్...పనికిరాని అల్లుడి క్రేజ్ !
X
బీఆర్ఎస్ అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైంది. సీఎం కేసీఆర్ ఏకంగా 115 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించేశారు. ఈసారి కూడా ఎక్కువ సిట్టింగులకే ప్రాధాన్యమిచ్చారు. ఎలాంటి మార్పులు చేయలేదు. కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే కొత్త అభ్యర్థులను ప్రకటించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి చుక్కెదురైంది. నాగార్జనసాగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని చూసిన అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మొదటి జాబితా లేదు. అక్కడ నోముల భగత్‌కు కేసీఆర్ అవకాశం కల్పించడంతో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది.
నాగార్జునసాగర్ అభ్యర్థిని మార్చే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల కాలంలో వార్తలు వచ్చాయి. నోముల భగత్ స్థానంలో కొత్త అభ్యర్థిని ప్రకటిస్తారని విస్తృత ప్రచారం జరిగింది. దీంతో అక్కడ పోటీచేసేందుకు అల్లు అర్జున్ కు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నాలు జరిపారు. ఈ మేరకు ఓ ఫౌండేషన్ కూడా స్థాపించి పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తన గ్రామంలో ఓ కన్వెన్షన్ సెంటర్ కూడా పారంభించి రెండు రోజుల కిందట అల్లు అర్జున్ తో ప్రారంభించారు. ఈ సందర్భంగారు అల్లు అర్జున్ అభిమానుల జన సందోహంతో నల్గొండ నిండిపోయింది. దారిపొడవునా, అల్లు అర్జున్ కట్ ఔట్స్, అలాగే బీఆర్ఎస్ నాయకుల కట్ ఔట్స్ విపరీతంగా కనిపించాయి. దీని ద్వారా తన అల్లుడితో పాటు..అతని అభిమానులు వున్నారని పరోక్షంగా చెప్పేందుకు ప్రయత్నించారు.
కంచర్ల చంద్రశేఖర రెడ్డికి టికెట్ దక్కేలా చేసి ఆయనను గెలిపించడానికి అల్లు అర్జున్ రంగంలోకి దిగినట్లు కూడా ప్రచారం జరిగింది. టికెట్ కోసం లాబీయింగ్ కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవంలో అల్లు అర్జున్ పొలిటికల్ కామెంట్స్ చేయలేదు. చంద్రశేఖర్ రెడ్డి మాత్రం రాజకీయంపై మాట్లాడారు. తనకి నాగార్జున సాగర్ నుండి ముఖ్యమంత్రి కెసిఆర్ పోటీ చేయమంటే తప్పకుండా చేస్తానని చెప్పారు. వేరే దగ్గర టికెట్ ఇచ్చినా బరిలో దిగుతా అని వెల్లడించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన జాబితో చంద్రశేఖర్ రెడ్డికి అవకాశం దక్కలేదు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ మామ ఏమి చేస్తారో చూడాలి.