Home > తెలంగాణ > మూడో రౌండ్‌లో కూడా కేసీఆర్ మూడో స్థానం!!

మూడో రౌండ్‌లో కూడా కేసీఆర్ మూడో స్థానం!!

మూడో రౌండ్‌లో కూడా కేసీఆర్ మూడో స్థానం!!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలుకాగా.. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వెనుకంజలో ఉంది. సీఎం కేసీఆర్ తో సహ పలువురు మంత్రులంతా పోలింగ్ లో వెనుకబడ్డారు. మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి , పాలకుర్తిలో ఎర్రబెల్లి, ఆదిలాబాద్ లో ఇంద్రకరణ్ రెడ్డి, మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. రెండు రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ స్థానాలు దాటింది. ప్రస్తుతం 65 స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్ లో ఉండగా బీఆర్ఎస్ 40 స్థానాల్లో లీడ్ లో ఉంది. బీజేపీ 10, ఎంఐఎం 3 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఇక సీఎం కేసీఆర్ బరిలో ఉన్న కామారెడ్డిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లీడింగ్‌లో ఉన్నారు.కామారెడ్డిలో గెలుపు తధ్యమని పార్టీ భావించినప్పటికీ ఏ రౌండ్ లోనూ కేసీఆర్ ఆధిక్యం చాటలేకపోయారు. మూడోరౌండ్ ఓట్ల లెక్కింపు జరుగగా మూడోస్థానానికి పరిమితం అయ్యారు. మరోవైపు గజ్వేల్‌ నియోజకవర్గంలో 920 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

కొడంగల్‌లో నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి రేవంత్ రెడ్డికి 5687 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ధర్మపురిలో 1439 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌, కామారెడ్డిలో నాలుగో రౌండు ముగిసేసరికి బీజేపీ లీడ్‌ లో ఉంది. మహేశ్వరంలో మూడో రౌండ్‌ ముగిసేసరికి బీజేపీకి 335 లీడ్ లో ఉంది.

Updated : 3 Dec 2023 5:16 AM GMT
Tags:    
Next Story
Share it
Top