Home > తెలంగాణ > TSNAB: అల్ఫాజోలం కొకైన్​ కంటే ప్రమాదకరం... సందీప్ శాండిల్య

TSNAB: అల్ఫాజోలం కొకైన్​ కంటే ప్రమాదకరం... సందీప్ శాండిల్య

TSNAB: అల్ఫాజోలం కొకైన్​ కంటే ప్రమాదకరం... సందీప్ శాండిల్య
X

రాష్ట్రంలో మాదకద్రవ్యాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు గట్టి చర్యలు చేపడుతున్నారు. అంతేగాక, మాదక ద్రవ్యాలను సమూలంగా అంతమొందించేందుకు ఏర్పాటైన టీఎస్​న్యాబ్ పక్కా ప్రణాళితో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే భారీ మొత్తంలో మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. ముఖ్యంగా కల్తీ కల్లు తయారీ కోసం ఉపయోగించే ఆల్ఫాజోలెంను ఇటీవల స్వాధీనం చేసుకుంది. దీనిపై తెలంగాణ యాంటీ నార్కొటిక్​బ్యూరో డైరెక్టర్ సందీప్​శాండిల్య మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల్లో అల్ఫాజోలం కొకైన్(Cocaine Drug) కంటే ప్రమాదకరమని, అక్రమంగా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాష్ట్రంలో అల్ఫాజోలం తలనొప్పిగా మారిందని, అల్ఫాజోలం రవాణా, పలువురి చేతులు మారటంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ఇటీవల రూ.3.14 కోట్లు విలువ చేసే 31.42 కిలోల అల్ఫాజోలాన్ని నాగర్​కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో పట్టుకున్నారు. ఈ సమాచారం ఆధారంగా TSNAB పోలీసులు 2 రోజుల క్రితం సంగారెడ్డి జిన్నారంలోని మూతపడిన పరిశ్రమలో 14 కిలోల నార్డజెపమ్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ కేసులో నలుగురుని అరెస్ట్ చేసినట్లు వివరించారు. మరో కేసులో సూరారం పరిధిలో నరేందర్ అనే వ్యక్తి నుంచి 10 కిలోల అల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నామని, ఇతను విజయవాడ పరమేశ్వరా కెమికల్స్(Chemicals)కి చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. మరో కేసులో విధుల నుంచి తొలగించబడిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ కూడా ఈ దందాలో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన పార్శిళ్లలో సైతం 34 కిలోలు పలువురి చేతులు మారినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇలా అల్ఫాజోలం విక్రయిస్తున్న నిందితుల్లో మాజీ పోలీసులు సహా కామారెడ్డికి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు. హైదరాబాద్​లో ఇప్పటి వరకు 66 కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.

ప్రమాదకరమైన ఈ ఆల్ఫాజోలెం కలిపిన కల్లును సేవించటం వల్ల తాగిన వారు క్రమంగా మృత్యు ముఖానికి చేరుకుంటారన్నారు సందీప్ ​శాండిల్య . కొంతమంది వ్యక్తులు రాష్ర్టవ్యాప్తంగా నెట్​వర్క్​ఏర్పాటు చేసుకుని ఆల్ఫాజోలెం దందా కొనసాగిస్తున్నారన్నారు. ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయటానికి డ్రగ్​కంట్రోల్, ఎక్సయిజ్​శాఖలతో సమన్వయాన్ని ఏర్పాటు చేసుకోనున్నట్టు తెలిపారు. సాధారణంగా బెన్​జోయల్, సైనేడ్​తదితర ముడి పదార్థాలను ఉపయోగించి ఈ ఆల్పాజోలెంను తయారు చేస్తారని చెప్పారు. కల్తీ కల్లు తయారీలో ప్రధానంగా దీనిని ఉపయోగిస్తారని పేర్కొన్న సందీప్​శాండిల్య ఒక్కసారి దీనికి అలవాటు పడ్డవారు మానుకోలేరన్నారు. మానేయాలని ప్రయత్నించినా విత్​డ్రా సింప్టమ్స్​చాలా తీవ్రంగా ఉంటాయన్నారు. మార్కెట్లో తేలికగా దొరుకుతూ జనం ప్రాణాలను తీస్తున్న ఆల్ఫాజోలెంపై ఇక ముందు మరింత దృష్టిని కేంద్రీకరిస్తామన్నారు.

Updated : 26 Dec 2023 2:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top