బీజేపీలో కొత్త ఉత్సాహం.. రాష్ట్రంలో బీజేపీ నేతల మకాం
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ సిద్ధం అవుతుంది. ఇప్పటికే మ్యానిఫెస్టో విడుదల చేసింది. అధిష్టానం నుంచి ప్రముఖ నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంతి అమిత్ షా రాష్ట్రంలో మరోసారి సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో మరింత ఉధృతం చేయడానికి శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మూర్ లోని సకల జనుల విజయ సంకల్ప బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారు. అనంతరం మధ్యహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, సాయంత్రం 4:30 గంటలకు అంబర్ పేట నియోజకవర్గ పరిధిలో రోడ్ షో నిర్వహిస్తారు. 25న ఉదయం 11 గంటలకు కొల్లాపూర్ లో పర్యటిస్తారు.
అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు మునుగోడు, 2 గంటలకు పటాన్ చెరు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పార్గొంటారు. సాయంత్రం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన రోడ్ షో లో పాల్గొంటారు. 26న ఉదయం 11 గంటలకు మక్తల్, మధ్యాహ్నం 1 గంటలకు ములుగు, మధ్యాహ్నం 3 గంటలకు భువనగిరి, సాయంత్రం 6 గంటలకు కూకట్ పల్లి నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభల్లో అమిత్ షా ప్రసంగిస్తారు. 26వ తేదీ రాత్రి 8 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన కోటి దీపోత్సవంలో పాల్గొంటారు. అమిత్ షా పర్యటనతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది.