Home > తెలంగాణ > కాళేశ్వరం గురించి కేసీఆర్ మోదీని కలవలేదు.. అమిత్ షా

కాళేశ్వరం గురించి కేసీఆర్ మోదీని కలవలేదు.. అమిత్ షా

కాళేశ్వరం గురించి కేసీఆర్ మోదీని కలవలేదు.. అమిత్ షా
X

కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే విషయమై ప్రధాని మోదీని కేసీఆర్‌ ఎప్పుడూ కలవలేదన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. మిషన్‌ భగరీథలో, కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరిలో ఏర్పాటు చేసిన సకలజనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్న అమిత్ షా.. పోచంపల్లి గ్రామంలో వినోబాబావే భూదాన ఉద్యమం చేస్తే.. కేసీఆర్‌ భూములను కబ్జా చేస్తున్నారు. భువనగిరి ఖిల్లాను కేసీఆర్‌ అభివృద్ధి చేయలేదని.. తాము అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణలో అధికారమిస్తే పెట్రోల్‌, డీజిల్‌ చౌకగా అందిస్తామన్నారు.

2014, 2018లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వెళ్లారన్నారు అమిత్ షా. ప్రజలు ఈ విషయం గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ వాగ్దానం చేసిందని, ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామన్నారు.

అంతకుముందు ములుగులో ఏర్పాటు చేసిన చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ ఆ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరుతారని అన్నారు అమిత్ షా. కేసీఆర్‌ను గద్దె దించాలంటే బీజేపీకి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోడు భూముల సమస్య పరిష్కరించలేక.. గిరిజనులకు, గిరిజనేతరులకు మధ్య బీఆర్‌ఎస్ వివాదం సృష్టిస్తోందని మండిపడ్డారు. గిరిజనులను కేసీఆర్ నిర్లక్ష‍్యం చేశారని దుయ్యబట్టారు. గిరిజనులను మోసం చేయడం కాంగ్రెస్ లక్షణమని ఆరోపించారు. కాంగ్రెస్ గిరిజన వ్యతిరేక పార్టీ అని చెప్పారు. తెలంగాణలో ప్రధాని మోదీ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. అత్యధిక గిరిజన ఎంపీలు బీజేపీకి చెందినవారే ఉన్నారని స్పష్టం చేశారు. సమ్మక్క సారక్క పండుగలను జాతీయ పండుగగా చేయాలని ప్రకటించామని చెప్పారు.

Updated : 26 Nov 2023 12:22 PM GMT
Tags:    
Next Story
Share it
Top