Home > తెలంగాణ > తెలంగాణ చరిత్రను 75 ఏళ్లపాటు వక్రీకరించారు: అమిత్‌షా

తెలంగాణ చరిత్రను 75 ఏళ్లపాటు వక్రీకరించారు: అమిత్‌షా

తెలంగాణ చరిత్రను 75 ఏళ్లపాటు వక్రీకరించారు: అమిత్‌షా
X

నిజాంపై అలుపెరుగని పోరాటం అచంచల దేశభక్తికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. హైదరాబాద్‌ విముక్తికి అమరులైన వీరులందరికీ నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ విమోచన దినోత్సవంకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత అమరవీరుల స్తూపం వద్ద అమిత్‌షా నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత భద్రతా బలగాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌ విముక్తి కోసం పోరాడిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నా. తెలంగాణ విమోచన దినోత్సవం గురించి దేశ ప్రజలందరికీ తెలియాలి. సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినోత్సవాలను జరపడానికి పలు కారణాలున్నాయని చెప్పారు. తెలంగాణ చరిత్రను 75 ఏళ్లపాటు వక్రీకరించారు. మోదీ ప్రధాని అయ్యాక ఆ పొరపాటులను సరిచేస్తున్నారు. 9 ఏళ్ల మోదీ పాలనలో దేశం ఎంతో ప్రగతి సాధించింది. మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ సేవాదివాస్‌గా జరుపుకుంటున్నాం. సర్దార్‌పటేల్‌ లేకుంటే తెలంగాణ విముక్తి సాధ్యమయ్యేది కాదు.

బ్రిటీష్‌ నుంచి భారత్‌కి స్వాతంత్య్రం వచ్చినా నిజాంలు తెలంగాణను 399 రోజుల పాటు పాలించారు. అన్నిరోజులు ఇక్కడి ప్రజలు నరకం చూశారు. సర్దార్ పటేల్‌ రంగంలోకి దిగి 400వ రోజు వాళ్లకు నిజాం కర్కశ పాలన నుంచి విముక్తినిచ్చారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ చొరవతో హైదరాబాద్‌ సంస్థానానికి విముక్తి కలిగింది. ఈ క్రమంలో ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారు. రావి నారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావు, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, నరసింహారావుకు నా నివాళులర్పిస్తున్నా. ‘ఆపరేషన్‌ పోలో’ పేరుతో నిజాం మెడలు పటేల్‌ వంచారు. రక్తం చిందకుండా నిజాం రజాకారులు లొంగిపోయేలా చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం గత పాలకులు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించలేదు. విమోచన దినోత్సవం జరపాలంటే కొందరు భయపడుతున్నారు"అని అమిత్‌షా అన్నారు.

Updated : 17 Sept 2023 11:43 AM IST
Tags:    
Next Story
Share it
Top