Home > తెలంగాణ > ఈసారి కూడా సిట్టింగ్లకే అవకాశం : అమిత్ షా

ఈసారి కూడా సిట్టింగ్లకే అవకాశం : అమిత్ షా

ఈసారి కూడా సిట్టింగ్లకే అవకాశం : అమిత్ షా
X

హైదరాబాద్ కు చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో తెలంగాణ బీజేపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. అనంతరం కొంగరకలాన్లో బీజేపీ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి హాజరయి.. రాబోయే లోక్ సభ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించిన అమిత్ షా.. రాష్ట్ర నేతల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ పై ఫైర్ అయ్యారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం, పత్రిక, మీడియాలో కథనాలు రావడంపై ఆయన సీరియస్ అయినట్లు తెలుస్తుంది. పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడొద్దని, మీడియాకు లీకులు ఇవ్వొద్దని క్లాస్ పీకినట్లు సమాచారం. రానున్న ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ ఎక్కువ సీట్లు సాధించేలా.. అంతా కలిసికట్టుగా పనిచేయాలని షా ఆదేశించారు.

నేతల మధ్య మనస్పర్థల వల్లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవలేకపోయామని, ఇకపై అలా జరగొద్దని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 30 సీట్లు వస్తాయని అనుకున్నాం. లోక్ సభ ఎలక్షన్స్ లో అత్యధిక సీట్లు గెలిచేందుకు కృషి చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. ఈసారి కూడా సిట్టింగ్లకే అవకాశం కల్పిస్తామని చెప్పారు. మిగతా చోట్ల సర్వేల ఆధారంగా అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు. త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని అమిత్ షా చెప్పారు.




Updated : 28 Dec 2023 5:32 PM IST
Tags:    
Next Story
Share it
Top