Home > తెలంగాణ > బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేశాయి - అమిత్ షా

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేశాయి - అమిత్ షా

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేశాయి - అమిత్ షా
X

బీజేపీ వస్తే కుటుంబ పార్టీ నుంచి తెలంగాణకు విముక్తి లభిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన.. జగిత్యాల జిల్లాలోని మెట్ పల్లిలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేశాయని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర దినోత్సవంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో భారీగా అవినీతికి పాల్పడిందని అమిత్ షా ఆరోపించారు.

అంతకు ముందు కోరుట్ల సభలో మాట్లాడిన అమిత్ షా ఈసారి తెలంగాణలో మూడుసార్లు దీపావళి జరుగుతుందని అన్నారు. డిసెంబర్ 3న బీజేపీ అధికారంలోకి వచ్చాక రెండో దీపావళి, జనవరిలో అయోధ్య రామమందిరం ప్రారంభమయ్యాక మూడోసారి దీపావళి జరుపుకుంటామని అన్నారు. బీజేపీ గెలిస్తే ఉచితంగా అయోధ్య దర్శనం చేయిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని పసుపు బోర్డు ప్రకటించారని, మూడు షుగర్ ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో బీడీ కార్మికుల కోసం 500 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని మాట ఇచ్చారు.

మరోవైపు జనగామలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో మాట్లాడిన అమిత్ షా.. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర, దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని అన్నారు. ఒవైసీకి భయపడి సీఎం కేసీఆర్‌ విమోచన దినోత్సవాలు జరపడం లేదని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం రాగానే విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించడంతో పాటు బైరాన్‌పల్లిలో అమరవీరుల స్మారక స్తూపం నిర్మిస్తామని చెప్పారు.

Updated : 20 Nov 2023 11:26 AM GMT
Tags:    
Next Story
Share it
Top