Home > తెలంగాణ > ఈ నెల 16న తెలంగాణకు అమిత్ షా..

ఈ నెల 16న తెలంగాణకు అమిత్ షా..

ఈ నెల 16న తెలంగాణకు అమిత్ షా..
X

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. రెండు రోజుల పాటు ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 16న షా హైదరాబాద్కు వస్తారు. అదే రోజు రాత్రి పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై అసెంబ్లీ ఎన్నికలు, చేపట్టాల్సిన కార్యక్రమాలు, అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తారు. సెప్టెంబర్ 17న బీజేపీ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగే విమోచన దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

షెడ్యూల్..

అమిత్ షా 16న రాత్రి 7.55 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి సీఆర్పీఎఫ్ సెక్టార్ ఆఫీసర్స్ మెస్కు వెళ్లి అక్కడే బస చేస్తారు. 17న ఉదయం 8.35గంటకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్కు చేరుకుంటారు. 9 గంటల నుంచి 11 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్లో జరిగే తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొంటారు. 11.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయలుదేరి.. 11.50కి ఢిల్లీకి పయనమవుతారు.

కాంగ్రెస్ సభ..

అదే రోజు పరేడ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించాలనుకుంది. అయితే ఈ సభకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో సభను తక్కుగూడకు షిఫ్ట్ చేశారు. తక్కుగూడలో జరిగే ఈ సభకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ముఖ్య అతిథులుగా వస్తున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది.


Updated : 12 Sept 2023 7:12 PM IST
Tags:    
Next Story
Share it
Top