Home > తెలంగాణ > ఈ నెల 28న తెలంగాణకు అమిత్ షా

ఈ నెల 28న తెలంగాణకు అమిత్ షా

ఈ నెల 28న తెలంగాణకు అమిత్ షా
X

ఈ నెల 28న కేంద్ర హోంశాఖ మంత్రి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది. డిసెంబర్ 28న మధ్యాహ్నం 12.05 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా నోవాటెల్ హోటల్ కు చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 1.50 గంటలకు కొంగర కలాన్ లో జరిగే బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలతో చర్చించనున్నారు. అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు కావాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. తెలంగాణ నుంచి కనీసం 6 ఎంపీ సీట్లైనా గెలవాలనే గట్టి పట్టుదలతో బీజేపీ ఉన్నది. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా బీజేపీ కూడా పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతోంది.




Updated : 26 Dec 2023 7:13 PM IST
Tags:    
Next Story
Share it
Top