Home > తెలంగాణ > ఈ నెల 29న తెలంగాణకు అమిత్ షా

ఈ నెల 29న తెలంగాణకు అమిత్ షా

ఈ నెల 29న తెలంగాణకు అమిత్ షా
X

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 29న తెలంగాణకు రానున్నారు. పార్టీ బలోపేతంపై రాష్ట్ర నేతలతో చర్చిస్తారు. ఎన్నికల దృష్ట్యా పార్టీలోని వివిధ విభాగాలతో ఆయన భేటీ అవుతారు. ఈ నెల 26న బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో ఎన్నికల కమిటీలను ఖరారు చేసే అవకాశం ఉంది. కాగా ఈ నెల 29న ఖమ్మంలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేసింది.

ఈ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ఈ సభను వాయిదా వేస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. అమిత్ షా పర్యటన మాత్రం యథాతధంగా ఉంటుంది. గత నెల 15న ఖమ్మంలో బీజేపీ సభ జరగాల్సి ఉంది. ఆ సభకు అమిత్‌ షా హాజరుకావాల్సి ఉంది. అయితే.. అప్పట్లో బిపర్‌జాయ్‌ తుఫాన్‌ కారణంగా షా పర్యటన రద్దయింది. ఇప్పుడు మరోసారి వర్షాల వల్ల ఖమ్మం రద్దు కావడం గమనార్హం.

షా తో సంజయ్ భేటీ..

మరోవైపు బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఇవాళ అమిత్ షాను కలిశారు. పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్న ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిని కోల్పోయాక అమిత్ షాను కలవడం ఇదే తొలిసారి. ఇద్దరూ తెలంగాణకు సంబంధించిన అంశాలతోపాటు అంతర్గత సమస్యలపై విభేదాలపై చర్చించినట్లు తెలుస్తోంది. లోపలి విషయాలను మీడియా ముందు మాట్లాడడం సరికాదని అమిత్ షా బండిని మందలించినట్లు సమాచారం. దీనికి బండి స్పందిస్తూ.. తనతోపాటు కొందరు బాగా పనిచేసే నేతలను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారని వాపోయినట్లు తెలుస్తోంది. కాగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని బండి కోరారు.

Updated : 24 July 2023 10:00 PM IST
Tags:    
Next Story
Share it
Top