Home > తెలంగాణ > Car Crash:పెళ్లి బృందంపై కారుతో విచక్షణారహితంగా దాడి

Car Crash:పెళ్లి బృందంపై కారుతో విచక్షణారహితంగా దాడి

Car Crash:పెళ్లి బృందంపై కారుతో విచక్షణారహితంగా దాడి
X

పాత కక్షలు కారణంగా పెళ్లి బృందంపై కారుతో విచక్షణారహితంగా దాడి చేసిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని రెడ్డిపల్లి వడ్డెర కాలనీలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై హరీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపల్లి వడ్డెర కాలనీకి చెందిన ఉప్పు వెంకటి కూతురు సువర్ణ వివాహం గురువారం రోజున జరిగింది. ఆ తర్వాత ఆమెను బారాత్‌తో ఘనంగా అత్తారింటికి సాగనంపారు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో అదే కాలనీకి చెందిన ఉప్పు నరేందర్‌, స్వామి గొడవపడ్డారు. నరేందర్, స్వామిని నెట్టివేయటంతో అతను కిందపడ్డాడు. వెంటనే అక్కడ ఉన్నవారు స్వామిని పక్కను తీసుకెళ్లారు. కోపంలో ఉన్న నరేందర్ తన వద్ద ఉన్న కారు (థార్)ను తెచ్చి అక్కడ ఉన్నవారిపై ఎక్కించాడు. ఈ ఘటనలో కాలనీకి చెందిన రమ్య (23)తో పాటు ఉప్పు దుర్గయ్య, సుజాత, యాదగిరి, సురేశ్​కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రమ్యను అంబులెన్స్​లో హైదరాబాద్ నిమ్స్​కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతి చెందింది. దుర్గయ్య, సుజాత, సురేశ్​లను నార్సింగిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అలాగే యాదగిరిని కామారెడ్డికి చికిత్స నిమిత్తం పంపించారు.





కారుతో దాడి చేస్తున్న సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న భీంరావుపల్లికి చెందిన యాదగిరి బైక్‌ను కూడా నరేందర్ ఢీ కొట్టాడు. బైక్​పై ఉన్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపట్టాడు. ఆ సమయంలో బైక్ గనుక రాకపోతే మరికొంత మంది ప్రాణాలు పోయేవని ఎస్సై హరీశ్ తెలిపారు. మృతురాలు రమ్య డిగ్రీ పూర్తి చేసి కూలీ పనులు చేసుకుంటోంది. మరికొన్ని రోజుల్లో ఆమెకు పెళ్లి చేద్దామనుకుంటున్న తల్లిదండ్రులు కుమార్తె మరణ వార్త విని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన నరేందర్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.




Updated : 5 Jan 2024 10:58 AM IST
Tags:    
Next Story
Share it
Top