విజయ్ దేవరకొండ సినిమాలో నటించి తప్పు చేశా : అనన్య పాండే
Krishna | 10 Nov 2023 10:03 PM IST
X
X
లైగర్.. ఇటు విజయ్ దేవరకొండ అటు పూరీ జగన్నాథ్కు మైండ్ బ్లాంక్ చేసిన సినిమా. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా కొన్న డిస్టిబ్యూటర్లు భారీ నష్టాలు వచ్చి రోడ్లపైకి వచ్చి ధర్నాలు సైతం చేశారు. ఈ సినిమాతో బాలీవుడ్ భామ అనన్య పాండే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఓ షోలో ఈ మూవీలో నటించడంపై అనన్య సంచలన వ్యాఖ్యలు చేసింది.
లైగర్ సినిమాలో నటించడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని అనన్య పాండే అన్నారు. కాఫీ విత్ కరణ్ షోలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి చుంకీపాండే, తల్లి భావన, నిర్మాత కరణ్ జొహార్ బలవంతంతోనే తాను ఈ చిత్రంలో నటించానని చెప్పింది. ఈ సినిమాకు వచ్చినంత చెత్త రివ్యూ తన జీవితంలో ఏ సినిమాకు రాలేదని వాపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Updated : 10 Nov 2023 10:03 PM IST
Tags: ananya pandey liger heroine vijay devarakonda liger ananya pandey on liger ananya pandey on vijay devarakonda bollywood heroine tollywood telugu movies
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire