Kranthi Kiran : దళిత బంధు కోసం డబ్బులు.. చంటి క్రాంతి కిరణ్ క్లారిటీ
X
తనపై వచ్చిన ఆరోపణల్ని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఖండించారు. దళితు బంధు కోసం తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు. మంత్రి దామోదర్ రాజనరసింహా తనపై కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై తాను విచారణకైనా సిద్ధమైన ప్రకటించారు. అవసరమైతే తాను లై డిటెక్టర్ పరీక్షకు కూడా రెడీ అని చెప్పారు. తాను డబ్బులు తీసుకోలేదని రుజువైతే దామోదర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అంతకుముందు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్పై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దళిత బంధు పథకాన్ని ఇప్పిస్తామంటూ తమ వద్ద డబ్బులు వసూలు చేసి తిరిగి ఇవ్వడం లేదని భూమయ్య అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దళిత బంధు లబ్దిదారుల జాబితాలో ఎంపిక చేయిస్తామంటూ క్రాంతి కిరణ్, అతని సోదరుడు కలిసి తమ వద్ద రూ.12.లక్షలు వసూలు చేశారని టేక్మల్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. తాము ఇచ్చిన డబ్బు తిరిగి చెల్లించాలని కోరితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.