Home > తెలంగాణ > జనహోరు మధ్య క్రాంతి కిరణ్ నామినేషన్

జనహోరు మధ్య క్రాంతి కిరణ్ నామినేషన్

జనహోరు మధ్య క్రాంతి కిరణ్ నామినేషన్
X

ఆందోల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. వేలమంది అనుచరులు, అభిమానులు, కార్యకర్తలతో ఊరేగింపుగా వెళ్లి జోగిపేటలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి పాండుకు సమర్పించారు. వీధులన్నీ గులాబీ జెండాలతో రెపరెపలాడాయి. ఐదేళ్లు ప్రజాసేవ చేసే అపురూప అవకాశం కల్పించినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని, మళ్లీ తననే గెలిపించాలని క్రాంతి కిరణ్ కోరారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో నంబర్ వన్ స్థానంలో నిలిపిందన్న ఆయన ఆందోల్ నిజయోజకర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. అభివృద్ధి కుంటుపడకుండా ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి రావాలన్నారు.

Updated : 10 Nov 2023 6:57 PM IST
Tags:    
Next Story
Share it
Top