కాంగ్రెస్ రాజ్యసభ టికెట్.. అనిల్ కుమార్ యాదవ్ ఏమన్నారంటే..?
X
తెలంగాణలో కాంగ్రెస్ యువ నేతలకు ప్రాధాన్యత ఇస్తోంది. మొన్న శాసనమండలికి ఎన్ఎస్ యూఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ను పంపగా.. రాజ్యసభకు మరో యువనేత అనిల్ కుమార్ యాదవ్ను ఎంపిక చేసింది. కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంపై అనిల్ స్పందించారు. కష్టపడేవారికి పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందని మరోసారి రుజువైందన్నారు. యువకుడిని అయిన తనకు పెద్దల సభకు వెళ్లే అవకాశం కల్పించడం ఆనందంగా ఉందన్నారు.
యూత్ కాంగ్రెస్ కార్యకర్తల కృషి వల్లే ఈ అవకాశం వచ్చిందని అనిల్ చెప్పారు. రాజ్యసభకు అవకాశం ఇస్తారని జీవితంలో అనుకోలేదన్నారు. కాగా అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ముషీరాబాద్ టికెట్ ఆశించారు. అయితే పార్టీ ఆయన తండ్రి అంజన్ కుమార్ యాదవ్కు ఆ స్థానాన్ని కేటాయించింది. ప్రస్తుతం అనిల్ సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. గతంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. అనిల్ కుమార్ యాదవ్కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.