Home > తెలంగాణ > Vemulawada Rajanna Temple : వేములవాడలో ప్రైవేట్​ దందా.. ఇష్టారీతిన ఆలయ కోడెలను..!

Vemulawada Rajanna Temple : వేములవాడలో ప్రైవేట్​ దందా.. ఇష్టారీతిన ఆలయ కోడెలను..!

Vemulawada Rajanna Temple : వేములవాడలో ప్రైవేట్​ దందా.. ఇష్టారీతిన ఆలయ కోడెలను..!
X

వేములవాడ రాజన్న ఆలయంలో కోడెలను కట్టేసే సంప్రదాయం ఉన్న విషయం తెలిసిందే. ఆనాదిగా వస్తున్న ఈ సంప్రదాయంపై అక్రమార్కులు కన్నేశారు. గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్ దందా నడిపిస్తున్నారు. ‘తెలంగాణ గోశాల ఫెడరేషన్’ పేరుతో లెటర్​ తెచ్చుకుంటే చాలు.. లక్షలు విలువజేసే కోడెలను ఆలయ అధికారులు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. అదే అదనుగా తీసుకున్న పలువురు అక్రమార్కులు గోశాలల ముసుగులో కోడెలను ఇతర ప్రాంతాలను తీసుకెళ్లి అమ్మేస్తున్నారు. జంతు సంరక్షణ చట్టానికి వ్యతిరేకంగా ఒక్కో వాహనంలో 20కి పైగా కోడెలను కుక్కి తీసుకెళ్తున్నారు. జనవరి 2న తిప్పపూర్ లోని రాజన్న గోశాల నుంచి 20 కోడెలను మహబూబాబాద్ లోని శ్రీసోమేశ్వర గో సంరక్షణ సేవా సంఘానికి ఆలయ అధికారులు అప్పగించారు. ఈ విషయంలో అనుమానం వచ్చి కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారిని అడ్డుకున్న పోలీసులు విచారించారు. విచారణలో వారు తీసుకెళ్తున్న చోట అసలు గోశాల లేదని తేలింది.

దీంతో వారిపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ ఘటన తర్వాత తెలంగాణ గోశాల ఫెడరేషన్ నిర్వాహకులతో పాటు అలయ అధికారులపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆలయానికి తీసుకొచ్చే కోడెలను సంరక్షించలేక గతంలో.. అధికారులు వీటిని వేలం వేశారు. వేలంలో కోడెలను కొనుగోలు చేసిన వారు.. వాటిని కబేళాలకు తరలిస్తుండటంతో.. అప్పటినుంచి వేలాన్ని నిలిపేశారు. ‘తెలంగాణ గోశాల ఫెడరేషన్’ అనే సంస్థ ద్వారా గోవులను సంరక్షించే గోశాలలకు ఉచితంగా అందిస్తున్నారు. కాగా, రాజన్న గోశాలల నుంచి గడిచిన ఏడాదిలో 1,866 కోడెలను, 28 ఆవులను తెలంగాణ గోశాల ఫేడరేషన్ సూచించిన వాళ్లకు ఆలయ అధికారులు అప్పగించారు. అయితే ఇవన్నీ నిజంగానే గోశాలకు వెళ్తున్నాయా? కబేళాలకు అమ్ముకుంటున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.




Updated : 6 Jan 2024 2:53 AM GMT
Tags:    
Next Story
Share it
Top