Home > తెలంగాణ > పోలీసు శాఖలో కొనసాగుతున్న బదిలీలు.. మరో 26 మంది డీఎస్పీల ట్రాన్స్ ఫర్

పోలీసు శాఖలో కొనసాగుతున్న బదిలీలు.. మరో 26 మంది డీఎస్పీల ట్రాన్స్ ఫర్

పోలీసు శాఖలో కొనసాగుతున్న బదిలీలు.. మరో 26 మంది డీఎస్పీల ట్రాన్స్ ఫర్
X

లోక్సభ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది. పోలీసు శాఖలో భారీగా అధికారులను ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. సోమవారం నుంచి మూడు దఫాలుగా డీఎస్పీ స్థాయి అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఇవాళ 26 మంది డీఎస్పీలకు స్థాన చలనం కల్పించిన హోంశాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే పోలీసు శాఖలో సోమవారం నుంచి ఇప్పటి వరకు 231 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. సోమవారం 110 మంది డీఎస్పీలకు హోంశాఖ స్థాన చలనం కల్పించింది. వారితో పాటు ఐదుగురు నాన్ క్యాడర్ ఎస్పీలు, 39 మంది అడిషనల్ ఎస్పీలను ట్రాన్స్ ఫర్ చేసింది. బుధవారం మరో 95 మంది డీఎస్పీలను సర్కారు బదిలీ చేసింది.




Updated : 15 Feb 2024 9:38 PM IST
Tags:    
Next Story
Share it
Top