Home > తెలంగాణ > Telangana : తెలంగాణ సర్కారీ దవఖానాల మరో రికార్డ్...ఒక్క ఆగస్టులోనే 76.3 శాతం డెలివరీలు

Telangana : తెలంగాణ సర్కారీ దవఖానాల మరో రికార్డ్...ఒక్క ఆగస్టులోనే 76.3 శాతం డెలివరీలు

Telangana : తెలంగాణ సర్కారీ దవఖానాల మరో రికార్డ్...ఒక్క ఆగస్టులోనే 76.3 శాతం డెలివరీలు
X

తెలంగాణ సర్కారీ దవఖానాలు మరో రికార్డ్ సృష్టించాయి. ఒక్క ఆగస్టు నెలలోనే రాష్ట్రవ్యాప్తంగా 76.3 శాతం ప్రసవాలు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా నారాయణపేటలో 89శాతం డెలివరీలు జరిగాయి. ఇక పనితీరులో మెదక్ జిల్లా మార్కులు కొట్టేసింది. ఇది చాలా గొప్ప విషయం అని తెలంగాణ చరిత్రలోనే సరికొత్త రికార్డ్ అని మంత్రి హరీశ్ రావు వైద్య సిబ్బందిని అభినందించారు. అదే విధంగా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.





వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశాలు, ఏఎన్‌ఎంలు, మెడికల్‌ ఆఫీసర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.."గవర్నమెంట్ హాస్పిటళ్లలో 2014లో కేవలం 30 శాతం మాత్రమే ప్రసవాలు జరిగాయి, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారధ్యంలో హెల్త్ డిపార్ట్‎మెంట్ చేస్తున్న కృషితో ఈ 9 ఏళ్లలో ఆ సంఖ్య డబుల్ అయ్యింది. సర్కారీ దవఖానలపై ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఘనత సాధించినందుకు వైద్య సిబ్బందికి అభినందనలు. డెలివరీలు చేయడంలో టాప్ ప్లేస్‎లో నిలిచిన నారాయణపేట, ములుగు, మెదక్‌ జిల్లాల సిబ్బందికి ప్రత్యేక అభినందనలు. తకువ డెలివరీలు నమోదైన జిల్లాల వారు తమ పనితీరును మెరుగుపరచాలి. గవర్నమెంట్ ఆస్పత్రుల్లో డెలివరీలు జరుగడంలో ఆశాలు, ఏఎన్‌ఎంలు చేస్తున్న కృషిని అభినందించాలి"అని మంత్రి అన్నారు.




Updated : 6 Sept 2023 10:38 AM IST
Tags:    
Next Story
Share it
Top