Home > తెలంగాణ > బోర్డ్ తిప్పేసిన మరో ఐటీ కంపెనీ.. నిరుద్యోగులకు నిలువునా ముంచేశారు

బోర్డ్ తిప్పేసిన మరో ఐటీ కంపెనీ.. నిరుద్యోగులకు నిలువునా ముంచేశారు

బోర్డ్ తిప్పేసిన మరో ఐటీ కంపెనీ.. నిరుద్యోగులకు నిలువునా ముంచేశారు
X

హైటెక్ సిటీలో మరో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. నిరుద్యోగులకు ట్రైనింగ్ తో పాటు ఉద్యోగం ఇస్తామని ఆశచూపిన సదరు కంపెనీ నిర్వాహకులు వారి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు. అనంతరం పక్కా లేకుండా పోయారు. ఉద్యోగం వస్తుందన్న ఆశతో డబ్బు కట్టిన నిరుద్యోగులంతా విషయం తెలిసి లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.





ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన బిజినేపల్లి ప్రేమ్‌ప్రకాష్‌(44) హైదరాబాద్ కు వలస వచ్చి సనత్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. తన ఫ్రెండ్ లిఖిత్తో కలసి ఏడాది క్రితం కొండాపూర్‌ వెస్ట్రన్‌ పెరల్‌ బిల్డింగ్లో సంట్ సూ ఇన్నోవేషన్స్‌ పేరుతో ఐటీ కంపెనీ ప్రారంభించాడు. అనంతరం నిరుద్యోగులకు గాలం వేశాడు. సాఫ్ట్ వేర్ కోర్సుల్లో ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు కోర్సు పూర్తైన తర్వాత సంస్థలోనే వారికి ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగులకు ఆశచూపారు. వారి మాటలు నమ్మిన పలువురు యువతీయువకులు ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలు చెల్లించారు.




కోర్సు కోసం డబ్బు చెల్లించిన వారికి 2 నెలలు ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ ఇచ్చారు. ఆ తర్వాత చేతులెత్తేశారు. దీంతో డబ్బు కట్టిన వారంతా నిలదీయగా వారి నుంచి ఎలాంటి స్పందించలేదు. దీంతో మోసపోయామని గుర్తించిన బాధుతులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితులు ప్రేమ్ ప్రకాష్, లిఖిత్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాధితుల నుంచి నిందితులు దాదాపు రూ.3కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలినట్లు సమాచారం.




Updated : 4 Sept 2023 9:21 AM IST
Tags:    
Next Story
Share it
Top