Home > తెలంగాణ > కోకాపేటలా మరో లగ్జరీ వెంచర్.. సర్కారువారి పాట అక్కడి నుంచి మొదలు

కోకాపేటలా మరో లగ్జరీ వెంచర్.. సర్కారువారి పాట అక్కడి నుంచి మొదలు

కోకాపేటలా మరో లగ్జరీ వెంచర్.. సర్కారువారి పాట అక్కడి నుంచి మొదలు
X

ఎకరా వంద కోట్లకు పైగా పలికిన హైదరాబాద్ కోకాపేట నియోపోలీస్ భూముల తరహాలో తెలంగాణ ప్రభుత్వం మరో భారీ వెంచర్ వేలానికి సిద్ధమైంది. ఐటీ హబ్‌గా మారనున్న రాజేంద్రనగర్ బుద్వేల్‌లోని ఖరీదైన భూములను అమ్మనుంది. 180 ఎకరాల నుంచి 100 ఎకరాలను లేఅవుట్‌గా అభివృద్ధి చేసిన హెచ్ఎండీఏ 14 ప్లాట్లుగా మార్చింది. చుట్టూ ప్రశాంతమైన వాతావరణంతోపాటు చేరువలోనే విమానాశ్రయం, ఇతర మెరుగైన రవాణా సదుపాయాలు ఉండడంతో భారీ ధరల పలకొచ్చని ఆశిస్తున్నారు. కోకాపేటలో కనీస ధర ఎకరాకు రూ.35 కోట్లు నిర్ణయించగా బుద్వేల్‌లో రూ.20 కోట్లుగా ప్రతిపాదించారు. ఈ లే అవుట్ రాజేంద్రనగర్‌ ఎగ్జిట్‌ రోడ్డు పక్కనే ఉంది. ఈనెల 6న టీ-హబ్‌లో ప్రీ బిడ్ సమావేశం నిర్వహించి 10న రెండు సెషన్లలో ఈ-వేలం వేస్తారు. రిజిస్ట్రేషన్‌కు ఈ నెల 8 ఆఖరు తేదీ. కనీస బిడ్ ధర ఎకరాకు రూ. 25 లక్షలు. ఎకరా రూ. 60 కోట్లకు అమ్ముడతై సర్కారు గల్లాపెట్టకు 6 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.

ప్రత్యేకతలు..

• బుద్వేల్‌ను ప్రభుత్వం ఐటీ హబ్‌గా మార్చనుంది. నివాస అవసరాలకు ఈ ప్రాంతం బావుటుంది.

• రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నుంచి అత్తాపూర్‌ ర్యాంపు దిగి సులువుగా చేరుకోవచ్చు.

• ఈ వెంచర్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు వేయనున్న ఎక్స్‌ప్రెస్‌ మైట్రోస్టేషన్‌కు లింక్ చేస్తారు.

• ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతితో ఇక్కడ కూడా ఎన్ని అంతస్తులైనా నిర్మించుకోవచ్చు.



Updated : 5 Aug 2023 8:41 AM IST
Tags:    
Next Story
Share it
Top