Home > తెలంగాణ > Cow Scam : పశుసంవర్థక శాఖలో మరో స్కాం.. ఆవుల పంపిణీలో గోల్మాల్

Cow Scam : పశుసంవర్థక శాఖలో మరో స్కాం.. ఆవుల పంపిణీలో గోల్మాల్

Cow Scam : పశుసంవర్థక శాఖలో మరో స్కాం.. ఆవుల పంపిణీలో గోల్మాల్
X

గత ప్రభుత్వంలోని పశుసంవర్థక శాఖలో జరిగిన మరో స్కాం వెలుగులోకి వచ్చింది. గొర్రెల స్కాం తరహాలో ఆవుల పంపిణీ స్కాం జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ డీజీకి పలువురు బాధితుల ఫిర్యాదు చేయడంతో.. దీనిపై దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ దర్యాప్తులో గొర్రెల పంపిణీ స్కాం చేసిన ముఠానే ఆవుల పంపిణీ స్కాం చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ స్కాంలో భాగమైన నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను నింధితులుగా చేర్చి అరెస్ట్ చేశారు. వీరు రైతులకు బదులు ఇతరుల ఖాతాల్లోకి నిధులు జమ అయ్యేలా చేశారు.

గొర్రెల పంపిణీలో స్కాం చేసినట్లే ఆవుల పంపిణీలో నిధులు దారిమళ్లించినట్లు గుర్తించారు. ఈ స్కాం ద్వారా దాదాపు రూ.3కోట్ల దోచుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా గొర్రెల స్కాంలో రూ.2.10 కోట్లు మోసం చేశారు ఈ నలుగురు నింధితులు. 2022, జనవరిలో ఈ పథకాన్ని ప్రారంభించగా.. ఒక్క యూనిట్ కు దాదాపు రూ.70వేల చొప్పున ప్రభుత్వం ధర నిర్ణయించింది. ఈ నిందితులు సుమారు 1200 యూనిట్ల ఆవులను రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.




Updated : 28 Feb 2024 6:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top