తృటిలో తప్పిన మరో రైలు ప్రమాదం..
X
ఒడిశా రైలు ప్రమాద ఘటన తర్వాత రైలు ప్రయాణంపై ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. భయంతో జనాలు ట్రైన్ ఎక్కుతున్నారు. ఈ ప్రమాదం తర్వాత కూడా పలు రైళ్ల ప్రమాదాలు తృటిలో తప్పడం ప్రయాణికులు టెన్షన్ గురవుతున్నారు. తాజాగా తెలంగాణలో మరో రైలు ప్రమాదం తప్పింది. బెల్లంపల్లి-మందమర్రి రైల్వే స్టేషన్ల మధ్య విద్యుత్ తీగ తెగిపోవడంతో రైళ్ల రాకపోకలు కాసేపు నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్‌కు వెళ్లే రైలు మందమర్రికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండగా రైలు ఇంజిన్‌కు విద్యుత్ తీగలు తగలడంతో తెగిపడ్డాయి. ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ తీగ తెగిపడి ఉండటాన్ని సిబ్బంది ముందుగా గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో నడిచిన రైళ్లకు తీవ్ర అంతరాయమేర్పడింది. కాజీపేట వైపునకు వెళ్తున్న కుచువెల్లి-కోర్బా ఎక్స్‌ప్రెస్ రైలును 3.10గంటలకు బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. రాజధాని రైలును 45 నిమిషాల పాటు నిలిపివేశారు. కోర్బా ఎక్స్‌ప్రెస్ దాదాపు 3గంటల పాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మరో వైపు కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ కోసం వచ్చిన ప్రయాణికులు నాలుగు గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. మరమ్మత్తులు అనంతరం రైళ్లరాకపోకలు సాగాయి.