Home > తెలంగాణ > 'అప్సర టార్చర్ తట్టుకోలేక నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు'.. మరో ట్విస్ట్!!

'అప్సర టార్చర్ తట్టుకోలేక నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు'.. మరో ట్విస్ట్!!

కూతురు పెళ్లి విషయంపై అప్సర తల్లి మౌనం

అప్సర టార్చర్ తట్టుకోలేక నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. మరో ట్విస్ట్!!
X




హైదరాబాద్ లోని సరూర్ నగర్ అప్సర హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. అప్సరకు ఇంతకు ముందే పెళ్లైందని.. భర్తతో కలిసి ఉన్న ఫొటోలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఫొటోల్లో ఉన్న కార్తీక్ రాజా అనే వ్యక్తి తల్లి ధనలక్ష్మి ఓ ఆడియో విడుదల చేయడం కలకలం రేపుతోంది. తన కొడుకు కార్తీక్ రాజు ఆత్మహత్యకు అప్సర, ఆమె తల్లి వేధింపులే కారణమంటూ సంచలన ఆరోపణలు చేసింది. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన తన కొడుకు కార్తీక్ రాజా, అప్సర ప్రేమించి పెళ్లి చేసుకునన్నారని చెప్పింది. ఆ తరువాత డబ్బుల కోసం, టూర్లకు వెళ్లాలంటూ అప్సర తన కొడుకును వేధించేదని.. లగ్జరీ లైఫ్ కోసం అతడిని హింసించేదని కార్తీక్ తల్లి ధనలక్ష్మి తెలిపింది. అప్సర, ఆమె తల్లి అరుణల వేధింపుల వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆడియోలో పేర్కొంది.





కార్తీక్ రాజా మీద ఒకసారి అప్సర పోలీస్ కేసు కూడా పెట్టిందని...దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని తెలిపింది. ఈ అవమానాన్ని తట్టుకోలేక కార్తీక్ రాజా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని.. ఆమె తన ఆడియోలో తెలిపింది. ఆ తరువాతి నుంచి అప్సర, ఆమె తల్లి అరుణ కనిపించలేదన్నారు. దీంతో ఇప్పుడు అప్సరకు అంతకుముందే పెళ్లయిందా?.. ఈ విషయం అప్సర ఇంట్లో తెలుసా..? ధనలక్ష్మి చేస్తున్న ఆరోపణలు నిజమేనా? ఫోటోల్లో అప్సరతో పాటు ఉన్నది ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.తన కూతురు పెళ్లి విషయం గురించి అప్సర తల్లి మౌనం వహించారు. అయితే అప్సర భర్త ఆత్మహత్య చేసుకోవడంతో ఏడాదిన్నర క్రితం సరూర్‌నగర్‌లోని తల్లి వద్దకు వచ్చినట్లు తెలిసింది.





మరోవైపు, ఈ హత్యోదంతంలో హతురాలి తల్లి, హత్య చేసి జైలుపాలైన పూజారి సాయికృష్ణ కుటుంబసభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. పూజారి అమాయకుడని.. అప్సరే అతడిని వేధించి ప్రాణాల మీదకు తెచ్చుకుందని సాయికృష్ణ తండ్రి, భార్య ఆరోపణలు గుప్పిస్తున్నారు. . గత మూడు నెలలుగా తన కొడుకును అప్సర తీవ్రంగా వేధిస్తోందని.. టార్చర్ భరించలేకపోతున్నానని కొడుకు అన్నాడని సాయికృష్ణ తండ్రిచెప్పుకొచ్చారు. అమాయకుడైతే హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని ఆలయం సమీపంలోనే పూడ్చిపెట్టి.. తనకేమి తెలియనట్లు పూజా కార్యక్రమాలు ఎలా చేశాడని అప్సర తల్లి, స్థానికులు ప్రశ్నిస్తున్నారు.




Updated : 12 Jun 2023 9:36 AM IST
Tags:    
Next Story
Share it
Top