Home > తెలంగాణ > బీఆర్ఎస్లో చేరిన రాకేష్ రెడ్డి.. కేటీఆర్పై ప్రశంసలు..

బీఆర్ఎస్లో చేరిన రాకేష్ రెడ్డి.. కేటీఆర్పై ప్రశంసలు..

బీఆర్ఎస్లో చేరిన రాకేష్ రెడ్డి.. కేటీఆర్పై ప్రశంసలు..
X

బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఏనుగుల రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ నుంచి హన్మకొండ టికెట్ ఆశించిన ఆయనకు అధిష్టానం షాకిచ్చింది. ఆ టికెట్ ను రావు పద్మకు కేటాయించింది. దీంతో రాకేష్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇదే సమయంలో పార్టీలోకి రావాలని బీఆర్ఎస్ ఆహ్వానించింది. దీంతో ఆయన కారెక్కారు.

ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్ అయితే.. భ‌విష్య‌త్ తెలంగాణ నిర్మాత కేటీఆర్ అని అన్నారు. వారి సార‌థ్యంలో పార్టీ బలోపేతానికి పనిచేస్తానని తెలిపారు. బీజేపీలో ప్రజాబలం ఉన్నవారికి గుర్తింపు లేదని.. డబ్బు ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తారని ఆరోపించారు. 11 ఏళ్లు పార్టీ బలోపేతానికి కృషి చేస్తే.. టికెట్ విషయంలో తనతో ఒక మాట అయిన చెప్పలేదన్నారు. కానీ బీఆర్ఎస్ యువ నాయకులకు పెద్ద పీట వేసిందన్నారు. మూడోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు.


Updated : 4 Nov 2023 8:52 PM IST
Tags:    
Next Story
Share it
Top