పార్టీ మారే ఎవర్నీ వదిలిపెట్టం..దాసోజు శ్రవణ్ హెచ్చరిక
X
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫైరయ్యారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను ఉద్దేశించి గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోలను ప్రదర్మిస్తూ దానం బీడీలు అమ్ముకునే వ్యక్తి అని శ్రవణ్ విమర్శించారు.. దివాన్‌జీ దగ్గర బీడీలు అమ్ముకునే దానం నాగేందర్‌తో గాంధీభవన్ దగ్గర బీడీలు అమ్మిస్తావా? అని సెటైర్ వేశారు. పార్టీలు మారిన నేతలపై సీబీఐ కేసులు పెట్టాలని.. పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టాలి, ఉరి తీయాలని గతంలో రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలను దాసోజు శ్రవణ్ గుర్తు చేశారు.
ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను మీడియా ముందు దాసోజు శ్రవణ్ ప్రదర్శించారు. ‘ ఒక పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మారితే వాళ్లను ఉరి తీసే చట్టాలు కావాలని మీడియా సాక్షిగా గాంధీ టోపీ పెట్టుకుని రేవంత్ రెడ్డి అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోని వాళ్లు ఎవరైనా పార్టీ మారే ప్రయత్నం చేస్తే వాళ్లను కొట్టి చంపుతామని కోమటిరెడ్డి చెప్పారు. వీళ్లిద్దరూ ఇంత పెద్ద ఎత్తున చిలుకపలుకలతో ప్రజలను నమ్మించి మోసం చేశారు.’ అని తెలిపారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని దానం నాగేందర్‌ను పార్టీలో జాయిన్ చేసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.