Home > తెలంగాణ > డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలో డబ్బుల జమ

డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలో డబ్బుల జమ

డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలో డబ్బుల జమ
X

వైఎస్సార్ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు నాలుగో విడత నిధులను విడుదల చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇప్పటివరకు వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా మూడు విడతల్లో సీఎం జగన్.. డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.19,175.97 కోట్లు జమచేయగా.. తాజాగా, మంగళవారం నాలుగో విడతగా మిగిలిన రూ.6,394.83 కోట్లను జమచేస్తూ వారికి ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తిస్థాయిలో నెరవేర్చారు. ఈ సందర్భంగా ఉరవకొండ బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తూ.. దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించనంత తేడా ఏపీలో కనిపిస్తోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. మహిళలకు నామినేటెడ్ పదవులు కల్పించామని, మహిళల భద్రత కోసం దిశ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.

వైఎస్సార్‌ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నామని, డ్వాక్రా మహిళల ఖాతాల్లో కోట్లు జమ చేశామని చెప్పారు. మహిళలు బాగుంటేనే రాష్ట్రం ముందడుగులో ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లంచాలు ల్లేవ్‌.. వివక్షకు చోటు లేదు.. వ్యత్యాసాలు ల్లేవ్‌.. ఇది రికార్డేనన్నారు. రాష్ట్రంలో 56 నెలల కాలంలో జరిగిన మంచిపై సంతోష పడుతున్నానని చెప్పారు. ఎక్కడా కులం, మతం, ప్రాంతం, వర్గం.. చివరకు ఏ పార్టీ అని చూడకుండా, ఓటు వేయకపోయినా పర్వాలేదు అర్హత ప్రామాణికంగా లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు.

ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఒక రికార్డుగా పేర్కొన్నారు సీఎం జగన్. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు. పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ కింద రూ.4,968 కోట్లు చెల్లించామని, ఆసరా, సున్నా వడ్డీ కింద రూ.31 వేల కోట్లు అందించామని చెప్పారు . 56 నెలల కాలంలో అక్కచెల్లెమ్మలకు రూ.2.53 లక్షల కోట్లు అందించామన్నారు. జగనన్న అమ్మఒడి కింద రూ.26,067 కోట్లు , వైఎస్సార్‌ చేయూత కింద రూ.14,129 కోట్లు అందించామని చెప్పారు. వైఎస్సార్‌ ఆసరా కింద రూ.25,571 కోట్ల రుణాలు చెల్లించామని చెప్పారు.

Updated : 23 Jan 2024 7:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top