Home > తెలంగాణ > హైదరాబాదే మునిగిపోయింది..మరోసారి బొత్స సంచలన కామెంట్స్

హైదరాబాదే మునిగిపోయింది..మరోసారి బొత్స సంచలన కామెంట్స్

హైదరాబాదే మునిగిపోయింది..మరోసారి బొత్స సంచలన కామెంట్స్
X

హైదరాబాద్ సిటీపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణలో విద్యావ్యవస్థ సరిగ్గా లేదని ఆయన వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఏపీ విద్యా విధానాన్ని తెలంగాణతో పోల్చటం సరికాదని.. తెలంగాణలో చూచి రాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నామంటూ అప్పట్లో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేయడం చర్చనీయాంశంగా మారింది.

వర్షాలకు హైదరాబాదే మునిగిపోయిందని బొత్స అన్నారు. చంద్రబాబు కట్టించిన హైటెక్ సిటీ కూడా మునిగిందన్నారు. కానీ టీడీపీకి మాత్రం జగనన్న కాలనీల్లోకి నీళ్లు రావడం మాత్రమే కన్పిస్తోందని అన్నారు. వర్షానికి నీళ్లు రావడం సహజమని.. జగనన్న కాలనీల్లోని వరదపై రాజకీయం చేయడం సరికాదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బాబు కూడా మునిగిపోవడం ఖాయమన్నారు. ప్రజలకు సీఎం జగన్ మంచి చేస్తుంటే టీడీపీకి నచ్చడం లేదని.. అందుకే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఇక అమ్మఒడి కార్యక్రమానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు రాక సినీ యాక్టర్లు వస్తారా అని బొత్స ప్రశ్నించారు. ప్రతి దానిని విమర్శించడం టీడీపీకి అలవాటైందన్నారు. విజయనగరం జిల్లాలో కుప్పంను మించిన అభివృద్ధి జరిగిందని చెప్పారు. అశోక్ గజపతి రాజు మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఏపీ అభివృద్ధి గురించి చెప్పడం మానేసి.. హైదరాబాద్ సిటీ మునిగిపోయిందంటూ బొత్స వ్యాఖ్యానించడం హాట్ టాపిక్గా మారింది. ముందు ఏపీ రాజధాని సంగతి చూసుకోవాలని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.

Updated : 28 July 2023 4:12 PM IST
Tags:    
Next Story
Share it
Top