Home > తెలంగాణ > Apple Foldable Phone : ఇండియన్ మార్కెట్లో.. యాపిల్ ఫోల్డబుల్ ఫోన్.. ధర ఎంతో తెలుసా?

Apple Foldable Phone : ఇండియన్ మార్కెట్లో.. యాపిల్ ఫోల్డబుల్ ఫోన్.. ధర ఎంతో తెలుసా?

Apple Foldable Phone : ఇండియన్ మార్కెట్లో.. యాపిల్ ఫోల్డబుల్ ఫోన్.. ధర ఎంతో తెలుసా?
X

మార్కెట్ లో ఎన్ని ఫోన్లు వచ్చినా.. యాపిల్ ఫోన్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వాటికి ఎంత రేటుకు తీసుకొచ్చినా.. కొనేందుకు అస్సలు వెనకడుగేయరు. అయితే కొత్త టేక్నాలజీని తీసుకురావడంతో యాపిల్ కాస్త వెనబడిందని చెప్పాలి. ఎందుకంటే.. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇప్పటికే చాలా కంపెనీలు ఫోల్డబుల్ ఫోన్లను తీసుకొచ్చాయి. అయితే యాపిల్ మాత్రం ఇందులో కాస్త వెనకబడిందని.. అభిమానుల్లో నిరాశ. కానీ త్వరలోనే యాపిల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఫోల్డబుల్ ఫోన్ టెక్నాలజీలో కాస్త ముందడుగు వేసిన యాపిల్.. మిగతా కంపెనీలకు గట్టిపోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. లీక్స్ ప్రకారం 7.6 - 8.4 అంగుళాల డిస్ ప్లేతో.. యాపిల్ మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ ను తీసుకొస్తుంది. అయితే ప్రస్తుతం ఈ టెక్నాలజీపై టెస్టింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. 2026-2027 మధ్య ఫోల్డబుల్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానుంది.





మరో నివేదిక ప్రకారం.. యాపిల్ iPad Miniని ఫోల్డబుల్ విభాగంలో తిరిగి లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మోడల్ 8.3 అంగుళాల లిక్విడ్ రెటినా IPS LCD స్క్రీన్‌‌తో వస్తున్నట్లు చెప్తున్నారు. భారత మార్కెట్ లో దీని ధర రూ.59,900 ఉండొచ్చని అంచనా. యాపిల్ కంపెనీ తన డివైస్ ల డిస్ ప్లేలను OLED డిస్ ప్లేతో అప్ గ్రేడ్ చేయాలని చూస్తుంది. కాబట్టి రాబోయే ఫోల్డబుల్ డివైజ్ లలో ఇదే డిస్ ప్లేతో తీసుకొచ్చే ప్లాన్ చేస్తుంది. ఫోల్డబుల్ ఫోన్ల వల్ల యాపిల్ ఆదాయం భారీగా పడిపోయింది. ముఖ్యంగా చైనాలో యాపిల్ మార్కెట్ పతనమయింది. అది గమనించిన యాపిల్ ఫోల్డబుల్ టెక్నాలజీపై వర్క్ చేస్తుంది.




Updated : 4 Feb 2024 7:16 AM IST
Tags:    
Next Story
Share it
Top