Home > తెలంగాణ > Congress : ఆరు గ్యారంటీలకు అప్లై చేశారా? దరఖాస్తు స్టేటస్ ఇలా తెలుసుకోండి

Congress : ఆరు గ్యారంటీలకు అప్లై చేశారా? దరఖాస్తు స్టేటస్ ఇలా తెలుసుకోండి

Congress : ఆరు గ్యారంటీలకు అప్లై చేశారా? దరఖాస్తు స్టేటస్ ఇలా తెలుసుకోండి
X

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల వద్దకు పాలనే పేరుతో ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజా సాలన పేరుతో డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించింది..

త్వరలో పథకాల అమలుకు శ్రీకారం చూట్టనుంది. దీనికి ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించి ప్రజా పాలన వివరాలు అందుబాటులోకి తీసుకురానుంది. prajapalana.telanga na.gov.in పేరుతో వెబ్‌సైట్‌ రూపకల్పనకు సిద్దమవుతుంది.

12,769 గ్రామ పంచాయతీలు, 3,623 మున్సిపల్ వార్డుల్లో ప్రజా పాలన సభలను నిర్వహించగా... 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఐదు గ్యారంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు అందగా.. ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 దరఖాస్తులను స్వీకరించారు. ఆరు గ్యారంటీల కింద అర్హులందరికీ మహాలక్ష్మి, రూ.500కే వంట గ్యాస్‌, కొత్త రేషన్‌ కార్డులు అందించనున్నారు.

ఇక లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత ఉండడం కోసం ప్రభుత్వం చర్యలు చెపట్టింది. ఇందులో భాగంగా ప్రజాపాలన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈనెల 17 వరకు నమోదు ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆన్‌లైన్‌లో లబ్ధిదారుల దరఖాస్తు స్టేటస్‌ను తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. దీని కోసం ప్రజా పాలన వెబ్‌సైట్‌లోకి వెళ్లి

"శ్రీయువర్‌ అప్లికేషన్‌ స్టేటస్‌శ్రీ" పై క్లిక్‌ చేయడం వల్ల దరఖాస్తు నంబర్‌‌ను అడుగుతుంది. దరఖాస్తు నంబర్‌‌ను ఎంట్రీ చేసిన తర్వాత దరఖాస్తు స్థితితో పాటు ఏఏ పథకాలకు మీరు అర్హులుగా ఉన్నారో తెలుసుకోవచ్చు.

ఓటీపీకి ఎవరికి చెప్ప వద్దు..

లబ్దిదారుల ఫోన్‌లకు వచ్చే ఓటీపీలు ఎవరికి చెప్ప వద్దని డబ్బులు పోగొట్టుకోవద్దు అంటూ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈమేరకు పోలీసులు పోస్టర్‌‌ను విడుదల చేస్తూ కింది సూచనలు చేశారు

ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేసినవారు అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి ఓటీపీ చెప్పొద్దు. సైబర్‌ మోసగాళ్ల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. వాస్తవానికి దరఖాస్తుదారులకు ప్రభుత్వ నుంచి ఎలాంటి ఓటీపీలు రావని.. ఫేక్‌ మెసేజ్‌లని ఓపెన్‌ చేయకూడదని హెచ్చరించారు. త్వరలో ప్రత్యేక వెబ్‌సైట్‌ అందుబాటులోకి వస్తుందని దానిలో దరఖాస్తు స్థితి తెలుసుకునే వెసులుబాటు

ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ అధికారులమని, ఖాతా అప్‌డేట్‌ చేస్తామని, ఆరు గ్యారంటీలు కావాలంటే మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీలను చెప్పమంటే వాటిని తిరస్కరించాలని వివరించారు. ఇక ప్రజా పాలనకు సంబంధించిన దరఖాస్తులు ప్రతీ నాలుగు నెలలకోసారి నిర్వహిస్తారని కాబట్టి తొందరపడి బ్రోకర్ల చేతిలో మోసపోవద్దని వెల్లడించారు.

Updated : 11 Jan 2024 1:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top