Home > తెలంగాణ > తలపై బలమైన గాయాల వల్లే చనిపోయింది.. అప్సర పోస్టుమార్టం నివేదికలో వెల్లడి

తలపై బలమైన గాయాల వల్లే చనిపోయింది.. అప్సర పోస్టుమార్టం నివేదికలో వెల్లడి

తలపై బలమైన గాయాల వల్లే చనిపోయింది.. అప్సర పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
X

హైదరాబాద్ సరూర్ నగర్లో హత్యకు గురైన అప్సర పోస్టుమార్టం ముగిసింది. ఉస్మానియా ఫోరెన్సిక్ డాక్టర్ యాదయ్య బృందం పోస్టుమార్టం చేసింది. అనంతరం ప్రాథమిక నివేదికను పోలీసులకు అందించింది. తలపై బలమైన గాయం కావడం వల్ల అప్సర ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్థారించారు. పోస్టుమార్టం పూర్తైన అనంతరం పోలీసులు అప్సర మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. సరూర్‌నగర్‌లో అప్సర అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు చెప్పారు.

వివాహేతర సంబంధం, ఆపై గొడవల నేపథ్యంలో అప్సరను దారుణంగా హత్యచేసిన నిందితుడు, పూజారి సాయికృష్ణను పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఐపీసీ సెక్షన్‌ 201, 302 కింద అతనిపై కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు

అప్సరను హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న నబ కొడుకు సాయికృష్ణ అమాయకుడని అతని తండ్రి అంటున్నాడు. అప్సరతో అతనికి అక్రమ సంబంధం ఉన్నట్లు తనకు గానీ తన కోడలికి గానీ తెలియదని అంటున్నారు. కేవలం డబ్బు కోసమే తన కొడుకును అప్సర కుటుంబం ట్రాప్‌ చేసి ఉంటుందని ఆరోపిస్తున్నాడు. అప్సర బ్యాంక్‌ అకౌంట్లు పరిశీలిస్తే ఆమె కుటుంబానికి ఆదాయం ఎలా వస్తుందన్నది తెలుస్తుందని అన్నారు. మరోవైపు సాయికృష్ణ భార్య సైతం తన భర్తకు అప్సరతో సంబంధం లేదని అంటున్నారు.

Updated : 10 Jun 2023 2:40 PM IST
Tags:    
Next Story
Share it
Top