బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
X
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ సీఎం కేసీఆర్ కుతురు, ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది. ఢీల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమెను అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ నుంచి సెర్చ్ వారెంట్‌తో వచ్చిన 10 మంది అధికారులు సుమారు 4 గంటలపాటు ఆమెను ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.
పలు డాక్యుమెంట్లను, కవిత ఫోన్లను సీజ్ చేశారు. కవిత అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఇవాళ ఈడీ, ఐటీ సోదాలు నిర్వహించాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత నివాసంలో సోదాలు జరిగాయి. కవితకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఈడీ, ఐటీ ప్రశ్నించిన్నట్లు సమాచారం.ఎన్నికల వేళ కుట్రపూరితంగానే కవితను అరెస్టు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.